Wednesday, October 19, 2022

శివోహం

నా మనసద్దంలో కనిపిస్తుంది...
శివ నీదే నెమో ఆ ప్రతిబిభం...

ఓం నమః శివాయ.

శివోహం

శంభో...
భౌతిక మౌనం తేలికగా ఉన్న....
నా మనసు అదుపులో లేక పరిపరి విధముల అదుపు తప్పుతోంది...
మట్టు పెట్టు నా మనసుని...
అట్టి పెట్టు  నీవు నాకు తెలిసేట్టు...

మహాదేవా శంభో శరణు...

శివోహం

అందరూ అంటూ ఎవరు లేరు శివ...
ఉన్నది నువ్వు ఒక్కడివే.

ఓం శివోహం...సర్వం శివమయం

Tuesday, October 18, 2022

శివోహం

జీతమిచ్చే యజమాని దగ్గర ఎంత భయ భక్తులతో ఉంటామో అలాగే గురువు దైవం దగ్గర కూడా  ఉంటె బాగుపడతాము...
ఎందుకంటే భయం నుండి దైవం పుట్టింది...
భక్తి నుండి దైవత్వం పుట్టింది...
భయం భక్తులను మించిన స్థితియే ముక్తి.

ఓం శివోహం... సర్వం శివమయం.

Monday, October 17, 2022

శివోహం

ప్రపంచం లో అతి ఖరీదైన వస్తువు నమ్మకం...
సంపాదించడానికి సంవత్సరాలు పడుతుంది పోగొట్టుకోవడానికి సేకనుమాత్రమే పడుతుంది...
ఓం నమః శివాయ.

Sunday, October 16, 2022

శివోహం

ఆకలి నిజమైతే ఆహారం దానికదే సమకూరుతుంది...
ఆర్తి నిజమైతే జ్ఞానం దానికదే సమకూరుతుంది...

ఓం నమః శివాయ

Friday, October 14, 2022

శివోహం

బాహ్యంలో నా నేను ఊరేగుతూ...
అంతరంలో నా నేను కు దూరమై...
ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు...
నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా..

మహాదేవా శంభో శరణు.

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...