Thursday, October 13, 2022

shivoham

నేను భూలోకం నుండి కైలాసం కు వెళ్ళే వాడిని కాదు...
కైలాసం నుండి భూలోకం వచ్చిన వాడిని...
భూలోక యత్రికుడిని...            

ఓం నమః శివాయ

Wednesday, October 12, 2022

శివోహం

సాటిలేని అందమైన తనువు దాల్చి సకల కర్మల యందు ఆసక్తికలవాడై పరమేశ్వరుడైన కృష్ణుడు యాదవులను అణచవలెనని సంకల్పించిన సమయాన జటావల్కలములు కమండలములు ధరించి, నల్లజింకతోలు కట్టుకున్న వారు, రుద్రాక్షలు వీభూతి అలంకరించిన శరీరాలతో విశ్వామిత్రుడు, అసితుడు, దుర్వాసుడు, భృగువు, అంగిరుడు, కశ్యపుడు, వామదేవుడు, వాఖిల్యులు, అత్రి, వశిష్టుడు, నారదుడు మున్నగు మునిశ్రేష్ఠులు స్వేచ్ఛావిహారం చేస్తూ ద్వారకానగరానికి విచ్చేసారు.

శివోహం

గడిచిన క్షణం వరకు జరిగిందంతా దైవ సంకల్పమే...

ఓం నమః శివాయ.

Tuesday, October 11, 2022

అమ్మ

అమ్మా...
నీ స్పర్శ కోసం అలమటించే ఈ బిడ్డనీకు కానరాలేదా...
ఒక్క నిమిషమయినా...
ఓకే ఒక్క నిముషమైనా నన్ను నీ ఒడిని చేర్చుకోమా...
అమ్మ లోకమాత శరణు.

అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే.

శివోహం

సమస్య లేకుండా జీవితం ఉంటుందా...
ఉండదు , కారణం జీవితమే సమస్య కాబట్టి...

ఓం నమః శివాయ.

Monday, October 10, 2022

శివోహం

శంభో!
నా నుదురుపై నీ నామములు మూడు...
నా మోపురముపై శ్రీ రామ రేఖలు మూడు...
మూడు మూడు ఆరు కోరికల అణచుదారి
చూపగలేవా చంద్రశేఖరా...
ఉడుతా భక్తిగ వందనములివే
అందుకొని ఆదుకోవయ్యా శివ.

మహాదేవా శంభో శరణు.

శివోహం

శివ, నీ అధ్యాత్మిక భక్తి ప్రపంచం లో ఏదో పొందాలని వచ్చిన నేను సర్వం పోగొట్టుకున్న...
ఇంకా మిగిలి ఉన్నది నేను...
నేను నీవు అయ్యేది ఎన్నడో ...   
ఓం నమః శివాయ

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...