Thursday, September 29, 2022

శివోహం

అహం వల్ల ద్వేషం కలుగుతుంది...
ద్వేషం చాలా భారమైనది దాన్ని మీరు ఎంత త్వరగా వదిలించుకుంటే అంత ఆనందంగా ఉండగలరు...

ఓం నమః శివాయ.

శివోహం

శంభో...
నా మనసు స్వేచ్చాపశువు గా తిరుగుతోంది దానికి నీ లీలల పాశంతో కట్టివుంచు...
నీ నామ సంకీర్తన అనే మేత వేసి నా ప్రతి రోజూ జన్మ సార్థకం తెలియచేయు...
నా యజమానినీవే అనే స్మరణ తేవయ్య శివ.

మహాదేవా శంభో శరణు.

Wednesday, September 28, 2022

శివోహం

శంభో...
ఈ ఆట చాలా కాలం ఆడాను...
ఇంకెంత కాలం ఆడతాను?...
నేను ఎప్పటి నుంచో ఆడుతూనే వున్నాను....
ఎన్నో లక్షల జన్మల్లో ఆడుతూనే వున్నాను...
ఈ జననమరణాలనే ఆట ఆడుతూనే వున్నాను.
ఇకచాలు తండ్రి ఈ జన్మతో ఇక చాలు. 

మహాదేవా శంభో శరణు.

Tuesday, September 27, 2022

శివోహం

శంభో...
నేను చేసినా ఖర్మ ఫలం నా గుండె కోత కొస్తే....
నేను పలికే నీ నామా స్మరణ ముక్తి ఫలము నియ్యదా శివ...
ఖర్మపలం తెంచు నీ దారికి రప్పించు
మహాదేవా శంభో శరణు.

Friday, September 23, 2022

శివోహం

కష్ట, సుఖాలలో నాకు తోడుగా ఉన్న ఆత్మ బంధువు నీవే శివ...
నీ నామమే నను నడుపుతున్న బలం...
కృతజ్ఞతలు శివా!
మహాదేవా శంభో శరణు.

Tuesday, September 20, 2022

శివోహం

శివయ్యా

ఎవరిని తలస్తూ
ఉపాధి వదిలినా
వారి కోసం మళ్ళీ మళ్ళీ
జన్మించాల్సి వస్తుంది

నిన్ను తలచి ఉపాధి
వదిలితేనే
మరల మరల జన్మించాల్సిన
అవసరం రాదు

శివయ్యా నీవే దిక్కయ్యా

Sunday, September 18, 2022

శివోహం

శివా!కొండలు గుండెలు బండలైననూ
వాటియందే నీవు వసియించేవు
ఆ బండరాళ్ళనే చేరి భాసించేవు
మహేశా . . . . . శరణు .

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...