Monday, September 12, 2022

శివోహం

నీవే ఆకాశము 
నీవే ప్రకాశము
నీవే వాయువు 
నీవే ఆయువు 
నీవే అగ్నివి 
నీవే జ్యోతివి
నీవే జలము 
నీవే జగము 
నీవే ధాత్రివి 
నీవే ప్రధాతవి 
నీవే సూన్యము 
నీవే పూర్ణము 
నీవే సర్వము 
నీవే శరణ్యము
మహదేవా శంభో శరణు.

Sunday, September 11, 2022

శివోహం

ఏ నిమిషమును నీదియు కాదు కాదు ,
నిజము తెలిపితే బతుకంత నీది నీది
ఏ కలము రాత నీదియు కాదు కాదు
నిజము హృదయము పట్టితే నీది నీది

శ్వాస నుండివచ్చేది ఊపిరియు కాదు 
విశ్వ మంతయు ఉన్నను కాదు నీది 
కర్మ లన్నీయు మర్మాలు కాదు కాదు  
ధర్మ మంతయు సంపద కాదు నీది

నీస్వ రములు నీవియు కానె కాదు కాదు     
నిన్ను ఆవహించే శక్తి కాదు నీది     
సంప దంతయు కష్టఫలమ్ము కాదు    
ఉన్న దంతయు పొందేది కాదు నీది

నీకు మాత్రమే తెలిసింది కాదు కాదు 
నీకు ఉన్నట్టి ప్రేమయు కాదు నీది
నీవు చేసేవి నిజముగా కాదు కాదు 
నీవు పొందే సుఖములన్ని కాదు నీది

శివోహం

అవును ఏదో ఒక నాడు నేను నా శాశ్వత చిరునామాకు వెళ్లిపోతాను...

కానీ...

నలువైపులా మీరు చిందే నవ్వులలో తడిసిన చిరు జల్లుల్లా అందరికీ కనిపిస్తాను...

శివుడి వైపు మీరు ఎంచుకున్న గమ్యం వైపు సాగే మీ బాట లో తడబాటు లేని అడుగుల జాడలలో కనిపిస్తా నేను...

నలుగురికీ మీరు పంచె ఆనందాల ప్రతిబింబాలలో
నలుగురికి చేయందించిన మీ సాయం లో నిస్వార్ధం నేర్పిన ఉనికిని నేనై కనిపిస్తాను...

నిరాశలో మీరు నింగి కేసి చూస్తే మీ కోసం నేనుంటాను...
ఏ కష్టాన్ని మీరు లెక్క చెయ్యకుండా మిలో ధైర్యం నిండేలా చల్లని వెన్నెల పై కురిపించే చక్కని చందమామ నౌతా

నిజంగా కడవరకూ మిలో జ్ఞాపకంగా ఉంటాను...

అవును నిజంగా నేను ఏదో ఒకరోజు నా శాశ్వత చిరునామాకు వెళ్లిపోతాను....

Saturday, September 10, 2022

శివోహం

ఓంకారానికి మరో పేరు ప్రణవనాదం...
ఆ ప్రణవనాద స్వరూపుడు విఘ్నేశ్వరుడు...
జీవితంలో ఎదురయ్యే సర్వ విఘ్నాలు తొలగించి విజయాలను దరిచేర్చేవాడు ఓంకార దివ్యస్వరూపుడు గణనాథుడు.
సర్వ విఘ్నములను తొలగించే సిద్ది వినాయకుడు.  సత్వర శుభాలను ప్రసాదించే శుభంకరుడు విఘ్నేశ్వరుడు మీ అందరికి సకల సుఖాలు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ.

ఓం గం గణపతియే నమః.

Friday, September 9, 2022

శివోహం

వదలను కాకా వదలను...
పట్టిన నీ పాదం గట్టిగా పట్టుకుంటా...
పట్టు పట్టారాదు పట్టు విడవరాదు...
విడవకుండా పట్టుకుంటా...
నిన్ను విడిచి పోవాలని లేదు...
శివ గణం లో నన్ను ఒకడిగా తీసుకువెళ్లు...
ప్రదమపూజిత విగ్నేశ్వరా శరణు.

శివోహం

మూలాధార దైవం సిద్ధి వినాయకుడిని స్మరించుకుంటూ అలాగే అన్న గారిని కార్తికేయ ను తలుచుకుంటూ...

సహస్రారం వరకూ ఓం నమఃశివాయ తో ప్రయాణం చేస్తూ...

అమ్మ ను దర్శనం చేసుకునే ప్రయత్నం అంతే...

ఆంత శివ మయమే కదా..

Thursday, September 8, 2022

శివోహం

దేహమను క్షేత్రంలో భగవత్స్వరూప స్మరణ లేక ఆత్మభావనయు ప్రేమ అను జలాభిషేకమును
శాంతము, దయ, సత్యం, వైరాగ్యం, తపస్సు అనెడు పుష్పములను సర్వేశ్వరధ్యానానందం లేక భక్తితో మునిగిన హృదయామృతమగు నైవేద్యమును 
ఉన్నప్పుడే మానవజన్మ సార్ధకత లేనిచో మానవజన్మ వ్యర్ధం.
 
ఓం శివోహం... సర్వం శివమయం.
- మహర్షి సద్గురు శ్రీ మలయాళస్వాములవారు

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...