Friday, September 2, 2022

శివోహం

వందేహం వృషభారూఢం
వందే భక్తాభయప్రదం
వందే జ్ఞానప్రదం దేవం
వందేహం చంద్రశేఖరం
ఓం శివోహం సర్వం శివమయం

Thursday, September 1, 2022

శివోహం

వందేహం వృషభారూఢం
వందే భక్తాభయప్రదం
వందే జ్ఞానప్రదం దేవం
వందేహం చంద్రశేఖరం
ఓం శివోహం సర్వం శివమయం

శివోహం

దైవానుగ్రహం అంటే నీ యొక్క అపారమైన  కరుణ, కటాక్షాలు, ప్రేమ, దయ, దీవెన, కలిగి ఉండట మే కదా...
అందుకే నిన్ను పూజించి, స్మరించి ,భజించు, అర్చించు, నీకోసం తపించి, తరించు మహా భాగ్యాన్ని మహా ప్రసాదంగా మాకు అనుగ్రహించు...

ఓం గం గణపతియే నమః.

శివోహం

శంభో...
నా మేను వీడి నేను నీ కడకు చేరాలని...
నా జీవన యానం సాగిస్తున్నాను...
నా యజమానివి నీవే కదా శివ ఆనతినీయాలి మరి...
బాడుగకు మరో దేహం చూసి పంపేది నీవే కదా...
నా విషయంలో నీకెందుకు శ్రమ...
నీ గణంలో ఒకడిని చేసుకొని నీ వాడిగా మలచుకో పరమేశ్వరా.

మహాదేవా శంభో శరణు.

Wednesday, August 31, 2022

శివోహం

పార్వతి నందన పన్నగ భూషణ...
హర హర నందన శ్రీ గణేశా...
మూల ధారా వినాయక శరణు.

ఓం గం గణపతియే నమః.

శివోహం

అణువు అణువున వెలసిన నీవు
మాకు అగుపించేది ప్రకృతిలో
ఆ ప్రకృతి పరవశములోనే మాకు
వినిపించేది నీ ప్రణవనాదమే
ఓంకారము బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమై శబ్దముగ శక్తి ఉద్భవించు చున్నది
అన్నిటికీ మూలాధారుడవు నీవే కదా శంకరా...

మహదేవా శంభో శరణు.

శివోహం

అణువు అణువున వెలసిన నీవు
మాకు అగుపించేది ప్రకృతిలో
ఆ ప్రకృతి పరవశములోనే మాకు
వినిపించేది నీ ప్రణవనాదమే
ఓంకారము బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమై శబ్దముగ శక్తి ఉద్భవించు చున్నది
అన్నిటికీ మూలాధారుడవు నీవే కదా శంకరా...

మహదేవా శంభో శరణు.

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...