Wednesday, August 31, 2022

శివోహం

విశ్వాసం అనేది చాలా అరుదుగా కనిపిస్తుంది మిత్రమా...

నీకు ఎక్కడైనా కనిపిస్తే దాన్ని నీతోనే ఉంచుకో...

ఓం శివోహం... సర్వం శివమయం.

Tuesday, August 30, 2022

శివోహం

సర్వ సిద్ధులను అనుగ్రహించే వరసిద్ధి ప్రదాయకాయ
బుద్దిని ప్రకాశింపచేయు పరిపూర్ణ మూషికవాహనాయ
యోగుల హృదయముల నందు ఉండే గజాననాయ
సర్వలోకాలను సమదృష్టితో చూసికాపాడే విశ్వనేత్రాయ అయ్యా గణపయ్య
స్వాగతం 
సుస్వాగతం...

శివోహం

జన్మలలో దారి తప్పిన మనస్సు
తెలియక చేసిన పాపాలు ఎన్నో
గాడి తప్పిన మతిని అనుసరించి
మనిషి చేసిన నేరాలు ఎన్నో

అన్ని దోషాల మూటలే
మోయలేని ఈ భారాలను 
ఎవరి తల అయినా 
ఎంత కాలం మోస్తుంది  
దూరాలు దుర్భరాలు 
కాకుండా ఉండాలి అంటే
భారాలను దించుకోవాలి 
వరించండం తేలిక కాదు
భారాలను బాధలను ఎత్తుకొనే వాళ్ళు
ఎత్తి పెట్టేవాళ్ళు ఎందరైనా ఉంటారు
దించుకొనే వాళ్ళు దించి పెట్టేవాళ్ళు
ఎక్క డున్నారు 

అందుకనే  అందరి బ్రతుకులు
మోయలేని భారాలుగా 
భరించలేని శాపాలుగా మారి పోతున్నాయి

బాధలను హరించేవాడు
పాపాలను తుడిచి పెట్టేవాడు
పరమేశ్వరుడు ఒక్కడే
అపరాధాలను మన్నించ మని
అనుగ్రహాన్ని అందించి
ప్రయాణాన్ని సుగమంగా మార్చమని
ప్రార్థిస్తూ భగవంతుని హర హర మని
ఎలుగెత్తి పిలుస్తున్నాము

Monday, August 29, 2022

శివోహం

శంభో...
లబ్ డబ్ ధ్వనితో  మొదలైన నా శబ్ద ప్రపంచం...
నీ చెంత నిశ్శబ్దంలో ముగుస్తుంది...
నడుమ ధ్వనులలో ఓం నమఃశివాయ శబ్దం మారుమోగేలా దీవించు పరమేశ్వరా...

మహదేవా శంభో శరణు.

శివోహం

లౌకికం...
ఆధ్యాత్మికం...
రెండూ "తన" ప్రతిబింబమే...
తానే రాధ, తానే కృష్ణుడు...
తానే సత్యం, తానే కేంద్రం.

రాధేక్రిష్ణ రాధే రాధే.

శివోహం

శంభో...
నా దృష్టి మరల్చి ...
నిను మరచి...
నేనుండలేను...
ఉంటే నీతోనే నీలోనే...

మహదేవా శంభో శరణు.

Sunday, August 28, 2022

శివోహం

నీఇంట, నీవెంట, నీసందిట

నేనున్నప్పుడు,

అసంకిల్పితంగా ఎప్పుడైనా

ఎదురాడినానా ప్రభూ?


నీచెంత ఏచింత లేకుండా ఉంటూ

అనాలోచితంగా నోరుజారి

కానిమాట ఏదైనా  అన్నానా ప్రభూ?


నీలాలనలో మేను మరచి నిద్రించిన నేను

నా కలవరింతలలో నిన్ను కలతపరచే

కఠినమైన మాట ఏదైనా అన్నానా ప్రభూ?


నీకోసం సాగిన నా వెతుకులాటలో

నా సరసన నిన్ను గానక నిరసనతో

ఏదైనా కరకుమాట నేనన్నానా ప్రభూ?


నా ఆలోచనలు నాలోని నిన్ను ఏమార్చ

నన్ను నేనుగా పైకెత్తుకోని - నిన్ను

కించపరచే మాట నోట జార్చానా ప్రభూ?


తెలియక, తెలివిలేక, తొందరతనంతో

నోరుజారిన నా నేరాన్ని క్షమించలేవా ప్రభూ?

మందమతినై నేనన్న మాటను మన్నించలేవా ప్రభూ?

నీకు దూరంగా అరవై వత్సరాల శిక్ష భరించాను

కాని మాటకు పరిహారం కాలేదా ప్రభూ?

అయిందా? నన్ను చేర్చుకో ..

లేదా ... నాతో ఉండు!


మహాదేవా శంభో శరణు. 

ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...