సీతారాముల జీవితం ఆదర్శప్రాయం...
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
Sunday, April 10, 2022
Friday, April 8, 2022
శివోహం
శివా!చిత్తాన నిను చేర చేరువే అనుకున్నా
అంతరంగాన ఆ పయనం దూరాభారమే
సూక్ష్మాన్ని ఎఱిగించు ,లక్ష్యాన్ని చేరగ
శివోహం
నా దైనందిన జీవితంలో నేను ఎదుర్కునే యుద్ధాల్లో నేనే కృష్ణుడిని, నేనే అర్జునుడిని...
పంచభూతాలు, సప్త ధాతువులతో నిర్మితమైన నా శరీరమే రధము...
రధానికి కట్టిఉన్న శైబ, సుగ్రీవ, మేఘ, పుష్ప బలాహకములను నాలుగు అశ్వములు నా ఆలోచనలు...
అహం బ్రహ్మస్మి.
Thursday, April 7, 2022
శివోహం
మనం చేసినా మంచి పనులకు మనం కర్తలమని గర్వించడం కూడా తప్పే...
భగవంతుని దయవలన ఆ పని చక్కగా జరిగింది -లేకపోతే నేను చేయగలిగే వాడిని కాదు...
అని అనడంలో నిజమైన గొప్పదనం ఉంటుంది
అతడి మనం ఒక పరికరాలం మాత్రమే...
శివుని ఆజ్ఞలేనిదీ చీమ అయినా కుట్టదు...
అలాగే మనం చేసే కర్మలు అతని ప్రేరణ వలన జరుగుతాయి అంతే కాని...
నేను చేశాను నా వల్లే ఇది జరిగింది నేను గొప్పవాడిని ఇలాంటి భావాలు అహంకారాన్ని అహం పెంచుతాయి ఫలితంగా భగవంతుని దయకు కరుణకు దూరం అవుతాం
శివోహం
మనిషి జీవితం దుఃఖమయం
తల్లి గర్భంలో ఉన్నప్పుడు పూర్వ జన్మ జ్ఞానం ఉండడంతో అయ్యో పుణ్యం సాధన చేయకుంటిని అని దుఃఖిస్తాడు.
ఈ గర్భస్తు నరకం నుండి ఎప్పుడు
బయటపడితే మళ్ళీ పదార్థ ప్రపంచంలో పడతానని దుఃఖిస్తాడు.
బయటకి రాగానే కన్నీళ్లు పెట్టుకుంటే పూర్వ జ్ఞానం పోయిందే అని దుఃఖిస్తాడు.
తల్లి పాల కోసం ఆకలితో దుఃఖిస్తాడు
శిశు ప్రాయంలో ఏది చెప్పాలన్నా ఏడుపు తప్ప వేరే మార్గం లేదు.
బాల్యం వచ్చేసరికి విద్య బుద్ధులు
నేర్పించడానికి పాఠశాలకు పంపుతారు విషయం పెరుగుతుందని దుఃఖిస్తాడు.
యవ్వనం రాగానే ఆకర్షణ మొదలవుతుంది ప్రేమ కోసం దుఃఖిస్తాడు.
ఉద్యోగం రాలేదని దుఃఖిస్తాడు.
ఇక్కడ విచారణ చేయాలి ఎందుకు ఎలా జరుగుతోందని అప్పుడే జ్ఞానం కలుగుతుంది అంతేకాని ఆత్మ హత్య చేసుకోరాదు.
పెళ్లి చేస్తే స్వేచ్ఛ పోయినదనిదుఃఖిస్తాడు.
భార్య బిడ్డలు మాట వినలేదని దుఃఖిస్తాడు.
పక్క వాళ్ళ కంటే మనం తక్కువగా ఉమ్నమని దుఃఖిస్తాడు.
వ్రిద్ధాప్యం వచ్చాక నవారు నన్ను చూడలేదని దుఃఖిస్తాడు.
ఆఖరికి మరణ సమయంలో కూడా ఈ వదలడం ఇష్టం లేక అందరి మీద మమకారం పెంచుకుని అయ్యో వాళ్లకు ఓ దారి చూపించకుండా పోతున్నానని దుఃఖిస్తాడు.
Tuesday, April 5, 2022
Subscribe to:
Posts (Atom)
శివోహం
https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u తెలిసి తెలియక నే చేసిన పాపమెంతో తెలివి రాక నే చేసిన దోష మెంతో మోయ లేనిక పాపాల భారమంతా ...
-
శివా!మట్టితో అనుబంధ మెంత గొప్పదో పుట్టి గిట్టుటలోన నేను మట్టినే కూడి మట్టి బొమ్మను నిను తెలిసి మురిసినాను మహేశా . . ... . శరణు .
-
శివా! నీ నాట్యానికి నా అహము వేదిక కానీ నీ నామము నా పదమున దీపిక కానీ నా గమనం నిన్ను చేరీ ముగిసిపోనీ మహేశా.....శరణు.
-
శివా! అద్దె ఇల్లు నాకు ఇరుకు గా ఉంది... బాధలు బందలతో గుండె గదుల్లో చోటే లేదు... ఐనా నీ ఇల్లు విడిచి... ఈ ఇరుకు గుండెలోన ఇమిడి ఉన్నావేమయ్యా....