Tuesday, April 5, 2022

శివోహం

దివ్యమైన మోహనరూపం నా తండ్రిది...
ఎంత చూసిన తనివి తీరదు...
అప్ప అని తలిచినంతనే కలతలన్నీ బాపి కొండంత ధైర్యం ఇచ్చే దేవదేవుడు నా తండ్రి...

ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప
ఓం శివోహం... సర్వం శివమయం.

Monday, April 4, 2022

శివోహం

శివాలయం లేని నా ఉరని చిన్న చూపు చూడకు...
పూజగది లేని అద్దె ఇల్లు నాకే ఇరుకుగా ఉందని తొంగిచూసి గుమ్మం నుంచే వెళ్లిపోకు...
పై రెండు కన్నా నా హృదయం చాలా విశాలమైనది...
నా గుండె గూటినే కైలాసం చేసుకో పరమేశ్వరా...
కష్టాల కడలి దుఃఖం తో ఉబికి వస్తున్న నా కన్నీటి జలం తో నిత్యం అభిషేకించుకో...

మహాదేవా శంభో శరణు....

శివోహం

ఉన్నదీ ఉన్నది...
ఉన్నది నేను అయి ఉన్నది...
ఉన్నది ఇప్పుడూ ఉంది...
ఉన్నది మరణం తర్వాత ఉంటుంది...
ఉన్నదిలో ఉన్నది ఉండడంకోసమే సాధన...

ఓం శివోహం... సర్వం శివమయం.
                                                 - రమణ మహర్షి

శివోహం

శివా!శివరాత్రి తెలియాలి నాకు
శివ దర్శనమవ్వాలి ఈ జన్మకు
నిటలాక్షా నన్నింక తిప్పకు
మహేశా . . . . . శరణు .

Sunday, April 3, 2022

శివోహం

అంతటా తానై...
అన్నీ తానై...
అందరిలో తానై...
ప్రాణుల మనుగడకు...
సృష్టి  స్తితి లయాలకు...
కాలచక్ర భ్రమనానికి కారణ భూతమై...
సూర్య చంద్రుల రూపంలో...
కళ్ళ ముందు నిత్యం వెలుగొందుతూ దర్శన మిస్తు...
నిత్యం నన్ను కాపాడే నా స్వామి సదా శివుడే సదా నాకు...

మహాదేవా శంభో శరణు...

శివోహం


శివా!హాలాహలాన్ని అదిమిపట్టి
అమృతాన్ని విడిచిపెట్టినా
నీవె శాశ్వతుడవు నీలకంఠా
మహేశా . . . . . శరణు .

శివోహం

నీవు పరమాత్ముడవు...
నేను జీవాత్ముడను...
కానీ నా అంతరాత్మలో  నిన్ను చూడాలన్న ఆవేదన...
నాలాంటి అజ్ఞానాంధకారబంధురంలో
కొట్టుమిట్టాడే కర్మబద్ధుడికి అది సాధ్యమేనా తండ్రి...

మహాదేవా శంభో శరణు...

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u తెలిసి తెలియక నే చేసిన పాపమెంతో తెలివి రాక నే చేసిన దోష మెంతో మోయ లేనిక పాపాల భారమంతా ...