Friday, February 25, 2022

శివోహం

నిన్ను నమ్మితే చాలు
గాజు ముక్కలోనూ ఉంటావు
మహాశివా
నిను కొలవాలే గాని
సర్వత్రా నీవే కొలువై ఉంటావు

సదా శివా
నీవు లేనిది ఎక్కడ
గాలి లోనూ నీటిలోనూ
నిప్పులోనూ నింగిలోనూ
అంతటా నీవే నిలచి ఉన్నావు

జగదీశుడవు 
ఆది దేవుడవు
ధర్మార్మ కాల స్వరూపుడవు
నిను పూజించని కరములా ఇవి
కాల సర్పంలా విషం చిమ్మునవి

నిను నమ్మిన వారికి
ఆపన్న హస్తాలు
అభయంకరా శంభో శంకరా
నిను చేర మార్గముపదేశింపరా
హరా పరమేశ్వరా

భద్రుడవు నీవే
రుద్రుడవు నీవే
మంగళాకారుడవూ నీవే
చిదానంద స్వరూపమూ నీదే
అన్నీ తెలిసీ మా పై ఈ పరీక్షలేల

త్రయంబకుడవూ నీవే
అర్దనారీశ్వరుడవూ నీవే
సదా నిర్వికారుడవూ నీవే
భోళా శంకరుడవూ నీవే
కాలుడవు నీవే మహా కాలుడవూ నీవే

సర్వేశ్వరా అంతటా 
నీవే నిండి ఉన్నావు
నిరాకారా నిర్విఘ్నకారకుడివి
సదా నిన్నే స్మరింతు
శ్రీశైల వాసా శ్రీ మల్లిఖార్జునా..!

     

శివోహం

శివా!వేయి జన్మలుగ నిన్ను వెతుకుచున్నాను
ఏ జన్మనూ నిన్నేలో తెలియలేకున్నాను
తెలియవచ్చెడి జన్మ కలుగనిమ్ము
మహేశా . . . . . శరణు.

Thursday, February 24, 2022

శివోహం

శివా!మదన పడుతున్నా మనసు వీడక
ఆ పైన నేను ఎవరో తెలియక
సతమతమవుతున్నాా శరణమంటున్నా
మహేశా . . . . . శరణు .

శివోహం

నాది అంటూ ఎం మిగిలి ఉంది నా వద్ద శివ...
ఒక్క మనసు తప్ప...
అది కూడా నీదే...
అంతా నీవే...
ఇదంతా నీదే...
నీ సొత్తును...
నేనునీకు సంతోషంగా కృతజ్ఞతా పూర్వకంగా  తిరిగి ఇవ్వడానికి  నా దగ్గర ఏమైనా ఉందా పిడికెడు బూడిది తప్ప...

మహాదేవా శంభో శరణు...

Wednesday, February 23, 2022

శివోహం

తొలిసంధ్యలో ఆరవిరిసిన అరవిందాలు మలిసంధ్యలో వాలి రాలిపోవడం సహజం...
అట్లే జనించాక మరణించడం కూడా సహజమే...
ఇది కాలధర్మం...
అయితే ఆ మరణం వెన్నెల్లో పూసిన పారిజాతాలు వేకువలో పరవశంగా పరమాత్మునిపూజకై రాలిపోయినట్లు ఉంటే ఆ జననంకు సార్ధకత ఉన్నట్లే...
ఇక మరుజన్మ లేనట్లే.

ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

శివా!నీ సిగ వెన్నెలకు  నెలవయ్యింది
నీ కరుణను తెలిపెడి ఋజువయ్యింది
నీ శరణము వేడగ అభయమయ్యింది
మహేశా . . . . . శరణు .

శివోహం

ఒక్కసారి ఓం నమః శివాయ అనండి...
స్వచ్ఛమైన ఆ పేరులోనే...
దాగుంది జీవితం అంతా...
ఆ నామాన్ని స్మరిస్తే చాలదా...
మనకి జీవితం ఆనందమయం కదా మిత్రమా...

ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...