Sunday, February 20, 2022

శివోహం

మనసు మానవుడికి భగవంతుడిచ్చిన భిక్ష...
దాని కక్ష్యలో బందీగా కాకుండా బంధువుగా జీవిస్తే నిత్యమూ ఆనందార్ణవంలో అమృతస్నానమే...
మనసును మందిరం చేసుకుని, మన ఇష్టదైవాన్ని ప్రతిష్ఠించుకోవాలి...
అప్పుడు ప్రతిబంధకాలన్నీ తొలగిపోయి, అదే అంతర్యామి కోవెలగా మారిపోతుంది.

ఓం శివోహం... సర్వం శివయమం.
ఓం నమో నారాయణ.

శివోహం

శివుణ్ణి నమ్ముకో మిత్రమా...
నీ భారాన్ని పరిపూర్ణ విశ్వాసం తో శివుడి పై నమ్మకం ఉంచితే నిన్ను తప్పక ఏ ఆపద నుండి అయిన రక్షిస్తాడు...
గరళం ను కంఠం లో దాచి సృష్టి ని కాపాడి రక్షిస్తునా వాడికి నీ బాధలు ఒక్క లెక్కనా ఏంటి.

ఓం శివోహం... సర్వం శివమయం.

Friday, February 18, 2022

శివోహం

ఊహ తెలిసిననాడు నిను ఎరుగనైతి...
మనసు తెలిసిననాడు బంధాలు గుమిగూడె...
మనసు మలినాలతో ముసురుకొని వున్నాది...
ఈ జన్మ నీ బిక్షే కదా తొలచి నీ సన్నిధికి నను చేర్చుకోలేవా శివ...

మహదేవా శంభో శరణు.

శివోహం

గతంలో స్వగతంలో ఉన్నది నీవే...
భవిష్యత్తులో ఉండేది నీవే...
అసలు నీవు...
నకలు నేను...
కానీ నిన్ను నమ్మిన నాకు ఈ చిక్కుల లెక్కలేనయ్యా శివ...
చిక్కులు తొలగించు...
దారి వైపు మళ్లించు...

మహాదేవా శంభో శరణు...

Thursday, February 17, 2022

శివోహం

ఆర్తిగా పలకరించడానికి ఆకలి బాధను పెట్టావు...
కడుపు నిండాక కోరికలు కోటలు దాటిస్తావు...
తీరని కోరికలు తపనతో నీరసం నిస్సత్తువ...
అలసటలో మౌనంగానే నీ నామస్మరణ...
ఎలాగైనా సరే నీవైపు నడుపుకోవటానికి...
బాధలు పెట్టకు భవభయహరా...

మహాదేవా శంభో శరణు...
ఓం శివోహం...సర్వం శివమయం

Wednesday, February 16, 2022

శివోహం

ఈ శరీరం సాధన మయం ఇదే శరీర ధర్మం
ఈ సాధన లేని శరీరాన్ని ప్రశాంతంగా ఉంచడం కష్టం
ఈ ఆధ్యాత్మికమైన జీవనం లో అంతా తెలిసినట్లే తొచినా అందులొ అంతా అమాయకత్వం
ఈ తెలియని తనంతొ పడె సంఘర్షన స్థిమితంగా ఉండనీయదు అదే అజ్ఞానం
ఈ తెలివైనతనంతొ నిరంతరం నిరూపనలతో ఒప్పించడం లొ కొట్టుమిట్టాడుతుంది జీవితం
ఈ గొప్పలు గొడవని తగలబెడితె  నిరాడంబరంగా ఉండగలం
ఈ నేను అన్న దాన్ని తొలగించుకుంటే అదే జ్ఞానం
ఈ అనంతంలో ఈ జీవి అణవు బుడగలొని గాలి అవుతుంది అనంతంలొకి ఐక్యం
ఇక వున్నదంతా సూన్యం

ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

మంచి చెడ్డలు మనిషికి చెందినవి కావు
మనసుకు చెందినవి...
వాల్మీకి, భక్తకన్నప్ప మొదలగు వారు చెడునుండి
మంచిగా మారినవారు...
మారినవారు మరల మారలేదు కానీ, నేను నా అవసరాలకు మంచి చెడుల నడుమ నలిగిపోతున్నా...
ఏదారిలో నడుపుతావో నీ దయ తండ్రి...
మహాదేవా శంభో శరణు...

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...