Thursday, December 30, 2021

శివోహం

పద్యములు రచించి పఠించగ పండితుడను కాను...
స్వరములు కూర్చి పాటలు పాడగ గాయకుడను కాను...

నీ గురించిన శాస్త్రమును వేదికపై
వివరింప విశ్వ విఖ్యాత నటన నాకు రాదు...

నాకు తెలిసినది ఒకటే ఆర్తిగా నీ వైపు చూస్తూ
శివ శివా యనుచూ నీ నామ స్మరణ చేస్తూ నా గుండెల్లో నిన్ను నింపుకోవడమే..

శివ నీ పాదముల దగ్గర నా హృదయం వుంచి ప్రార్ధించడమే...

మహాదేవా శంభో శరణు...

శివోహం

మనకు కారణం లేకుండా కోపం వస్తుంది కానీ...
కారణం లేకుండా భక్తిరాదు...
కారణం లేకుండా భక్తి ఎవరికి వస్తుందో వారు తరిస్తారు...

ఓం నమః శివాయ.
ఓం శివోహం... సర్వం శివమయం.

Wednesday, December 29, 2021

శివోహం

శంభో...
నీ నామము, నీ రూపం, స్మరణం
ఇవే నా మనసుకు పరిచయం...
నిత్యం నీరూపదర్శనంతో నీ నామ స్మరణమే దినచర్య...
ఇక నీవే కరుణించి ఏదో సమయంలో నీవొకసారి దర్శనం ఈయగరావా రావా శివ.

మహాదేవా శంభో శరణు.

శివోహం

శంభో...
నా బుధ్ధి అంతా నీ మీదే ఉంచు...
గంగ ఎంత వేగంగా తిరిగినా చివరకి సముద్రం వైపునకు ప్రవహించురీతిన, నా బుధ్ధి ఎంత చంచలంగా ఉన్నా ఇతరముల వైపునకు మరలక,
నిన్నే కలిసేటట్లు నీయందే ఉండాలా అనుగ్రహించు...

మహాదేవా శంభో శరణు.

Tuesday, December 28, 2021

శివోహం

నేను నీకు సర్వదా కృతజ్ఞుణ్ణి తండ్రి...
నీ సృష్టిని చూసి తరించే దృష్టిని...
నీ లీలలు పాడే తీయని పలుకుని...
నిన్ను చేరే వడి వడి నడకని...
నీలో లీనమవాలనే చైతన్యాన్ని ఇచ్చి నన్ను
సృష్టించినందుకు...

మహాదేవా శంభో శరణు...

శివోహం

ప్రేమికుడంటే పరమేశ్వరుడే...
అమ్మకి తనలో సగానిచ్చి జనానికి ప్రేమతత్వాన్ని బోధించిన ఆది ప్రేమగురువు నా శివుడు...
ప్రేమిస్తే శివుడిలా ప్రేమించాలి...
శివుడిలా ఆ ప్రేమను గెలిపించుకోవాలి...
శివుడిలా ఆ ప్రేమను నిలబెట్టుకోవాలి...

ఓం శివోహం... సర్వం శివమయం

Monday, December 27, 2021

శివోహం

శంభో...
మనసులో ఎన్నో ఆశలు పుట్టిస్తావు...
కోర్కెల వెంట పరుగులు తీయిస్తావు...
బంధాలలో బంధిని చేసి మము ఇరికిస్తావు...
నీవు ఆడే ఆటలో బొమ్మలను చేసి...
నీకు తోచినట్టు మలచుకుంటావు...
చిత్రమయ్యా నీ లీలలు అంతుపట్టదు...
శంభో నువ్వు ఆడే ఆటలు నేను అడలేను...
జీవితం లో మళ్ళీ మళ్ళీ నేను ఒడిపోలేను...
నా దారి నీ వైపు మళ్లించి నన్ను గెలిపించు

మహాదేవా శంభో శరణు...

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...