త్రిమూర్తులలలో ఉన్న మహాశివుడు గుణ రహితుడు, దయామయుడు, భోలా శంకరుడు, చంద్రశేఖరుడు, గంగాధరుడు,కంట్టము చుట్టు కర్ణములపై సర్పాలను ధరించువాడు, అగ్నిశిఖ నేత్రము కలవాడు, సుందరమైన గజ చర్మము వస్త్రముగా ధరించు వాడు, త్రైలోక్య సారభూతుడు, నిత్యమూ శ్రీ రామ జపము చేయువాడు, కోరినవార్కి కోరిన వారాల ఇచ్చే నిత్యమూ ప్రార్ధిమ్చుతూ ఉంటే మోక్షము సిద్ధించుతుంది...
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
Sunday, October 24, 2021
శివోహం
శివా!యోచితంగా ,అనాలోచితంగా
ఏదైనా నా ఆలోచనలన్నీ నిన్నే చుట్టనీ
విడువకుండా నీ చేయి నన్ను పట్టనీ.
మహేశా ..... శరణు.
శివా!గణపతి ధళపతి నీ సుతులే
నాభి బంధము లేకే నడయాడ వచ్చారు
అట్టి వాడనే కదా తెలియ నేను
మహేశా . . . . . శరణు .
పశు భావన నాలో తొలగలేదు
భావోన్నతి కల్పించు భవ శరణం అందించు
మహేశా . . . . . శరణు.
Saturday, October 23, 2021
శివోహం
శంభో! నీ కృప లేని నా జీవితం నిష్ఫలం...
ఏ అర్థము , పరమార్థము కానరాని నా జీవితానికి ముగింపు పలికి నీ సన్నిధిలో నిలుపుతావో...
లేక నీ అనుగ్రహం తో బ్రతికించి నీ సేవలో తరింపజేస్తావో కానీ...
స్వామీ నీదే భారము...
అన్యం తెలియని నాకు నీవే గతి నీకే శరణు...
శివోహం
దీనజనబాంధవా...
మేము కర్మబద్ధులం
అల్పులము
మందబుద్ది కలవారము
అజ్ఞానులం
నీవు కరుణించి మాకు సద్భావన సన్మార్గ చింతనలను ప్రసాదించుము...
నిన్ను మేము మరచినా
నీవు మాత్రం మమ్మల్ని మరిచిపోకు తండ్రి..
హరే గోవిందా...
Friday, October 22, 2021
శివోహం
శంభో...
నేను కీర్తించువాడను...
నీవు రక్షించే వాడవు...
తప్పిందము చేయు వాడను నేను...
తప్పించువాడవు నీవు...
Subscribe to:
Posts (Atom)
శివోహం
శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...
-
శివా!మట్టితో అనుబంధ మెంత గొప్పదో పుట్టి గిట్టుటలోన నేను మట్టినే కూడి మట్టి బొమ్మను నిను తెలిసి మురిసినాను మహేశా . . ... . శరణు .
-
https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! సందేహాల పురమీ మానవ దేహం అహం, మోహం రెండూ గుణశ్రేణియై నీకు నాకు మధ్య దూరం పెంచుతున...
-
శివా! నీ నాట్యానికి నా అహము వేదిక కానీ నీ నామము నా పదమున దీపిక కానీ నా గమనం నిన్ను చేరీ ముగిసిపోనీ మహేశా.....శరణు.