సృష్టి, స్థితి, మరియు లయము లలో నీవే పరమ సత్యము...
సత్యమునకు మూలము మరియు అంతము నీవే పరమేశ్వరా...
సమస్త సత్యమునకు సారము నీవే...
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...