శంభో!!! పూర్వకృత కర్మఫలం అనుభవింపక తప్పదా శివ ఎంతటివారికైనా...
అయితే
అలా కర్మఫలం ముగిసిన నాడు నీ సన్నిధికే చేరువయ్యేలా నన్ను అనుగ్రహించు ప్రభూ...
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...