Tuesday, March 9, 2021

శివోహం

సృష్టి, స్థితి, మరియు లయము లలో నీవే పరమ సత్యము...

సత్యమునకు మూలము మరియు అంతము నీవే...

నీవే సమస్త సత్యమునకు సారము...

నీవే సర్వం నీవే సకలం

ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

అన్నీ తెలుసని మనిషి...
తనని తాను తెలుసుకోలేక మాయలో పడతాడు....
ఈరోజు నాది అనుకున్నది...
రేపు ఇంకొకరిది...
అంతా మాయా ఎప్పుడు తెలుసుకుండాడు...
మహాదేవుడి పాదాలు పట్టుకుంటే నే కదా...
మాయనుండి బయటపడేది....

ఓం శివోహం... సర్వం శివమయం
మహాదేవా శంభో శరణు...

శ్రీరామ

రామభక్త హనుమా...
రామ భక్తుడివి నివయ్య...
నీ భక్తుడను నేనయ్య...
నిన్ను నమ్మిన భక్తులకు ఆలస్యం చేయకుండా...
అనుగ్రహించవయ్య హనుమయ్యా...
దారి చూపించడమే నీ పని...
గమ్యాన్ని చేరుకోవడం నా పని...

రామభక్త హనుమా శరణు తండ్రి శరణు....

Monday, March 8, 2021

శివోహం

నా గుండె బరువు గా ఉన్నాడు...
దుఃఖం నన్ను ఆవరించినప్పుడు...
శివ నామ స్మరణే చేశాక...
నా గుండె బరువు తగ్గి మనసు చల్లబడి...
తనువు కైలాసం అవుతుంది పరమేశ్వరా...

మహాదేవా శంభో శరణు...
ఓం శివోహం ...సర్వం శివమయం

శివోహం

వచ్చిన పని పూర్తయ్యేవరకూ...
ఈవేదిక మీద ఆడవలసిందే...
పొగిడేవాళ్ళుంటారు...
విమర్శించేవారుంటారు...
జీవితాన్ని, నటనను సర్వాన్ని...
నీకె అంకితం చేసి ఇదే నా చివరి నాటకం కావాలని
నీ మెప్పుకోసం చూస్తున్నా...
మహాదేవా శంభో శరణు...

శివోహం

జననం నీవే...
గమనం నీవే...
సృష్టివి నీవే...
కర్తవు నీవే...
కర్మవు నీవే...
ఈ జగమంత నీవే తల్లి....
అమ్మ నీ దయ ఉంటే అన్ని ఉన్నట్టే...

ఓం శ్రీమాత్రే నమః

Sunday, March 7, 2021

శివోహం

ఒకటి తీయడం అతని పనే...
దానితో కృంగిపోకుడదు...
అదే స్థానంలో ఇంకోటి పెట్టగల దయగల మారాజు అతడే...
అతని ఆటకు అలుపు ఉండదు...
నమ్మిన వాళ్లకు నమ్మినంత...

ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...