ఈ సృష్టంతా సర్వేశ్వరుని స్వప్నసదృశ్యం...
సర్వాంతర్యామి స్వప్నమిది....
మనమంతా ఆ జగన్నాటకంలో పాత్రలం...
ఆట ఆడేది ఆడించేది అంత ఆయనే...
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...