శివా ! సమస్త జీవకోటిని
ఆదరించి అనుగ్రహించే మహదేవా...
పరమదయామయా... భక్తవత్సలా...
నాలోని లోపాలు తొలగించి...
పాపాలు నశింపజేసి...
నీ దివ్యానుగ్రహం అందించు...
తండ్రీ సోమనాథా... !!
చంద్రశేఖరా...
పాహిమామ్ రక్షమామ్...
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...