శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
Wednesday, July 8, 2020
శివోహం
శివా! సంసారాన్ని పోల్చగ సాగరం సృష్టించావో
సాగరాన్ని పోలిన సంసారాన్ని కూర్చావో..గానీ
సంసార సాగరాలు దాట కష్టసాధ్యమాయె.
శివోహం
ప్రేమలో నీకు లేరు పోటి, రౌద్రం లో నీకు ఎదురు ఎవరు గీత దాటి,
రక్షించడంలో నీకు నువ్వే సాటి,
ప్రేమలో ప్రాణాలు రుద్రుడవ్,
రౌద్రం లో ప్రణయ్ రుద్రుడవ్,
కన్నుమూస్తే శాంతి స్వరూపం,
కన్ను తెరిస్తే రుద్రరూపం......
నువ్వే లాలిస్తావ్ ,పాలి స్తావ్, శిక్షిస్తావ్, పరీక్షిస్తావ్, కరుణిస్తావ్ ,కాపాడతావ్. .... శివయ్య!! ఏమిటయ్యా నీ మాయ ?
ఎంత అని వర్ణించేదము అయ్యా ???
శివయ్య ........
హర హర మహాదేవ శంభో శంకరా
శివోహం
నీ నామ స్మరణలో హృదయమందు....
కలిగే సంతోషం తన్మయత్వం....
గొప్ప అనుభూతి మరెక్కడా దొరకదు తండ్రి.....
శివోహం
పూజకు వేళాయేను ప్రార్థన మొదలయ్యేను
సూర్యోదయముతో మేధస్సే ఉత్తేజమయ్యేను
పుష్పాలన్నీ వికసించేను ని కోసమే
సుమ గంధాలన్నీ వీచేను నీ కోసమే
మెరిసే సువర్ణాలన్నీ వెలిగేను నీ కోసమే
సువర్ణ కాంతుల వెన్నెల వేచేను నీ కోసమే .
ఇకనైనా నీ మొద్దు నిద్దురా విడరా
కైలాసం దిగిరరా పరమేశ్వరా
ఆస్తులు అంతస్తులు అడగను
బంగారం ,మణి మణిక్యాలు అడగను,
సంపదలు నాకు వద్దు
నీ నామ స్మరణే చాలు
నీకు అభిషేకం చేయడానికి కన్నీటిని సిద్ధం సిద్ధం చేసి ఉంచాను
నా మొర ఆలకించి దిగిరరా పరమేశ్వరా!!!!
శివోహం
మానవుని దేహానికి శివం అని పేరు.
శివం అనగా మంగళకరం అని మరో అర్థం. సదాలోచనలు, సచ్చింతనలతో దేహాన్ని శివంగా మార్చుకోవాలే తప్ప దుర్భావాలు,దుశ్చింతనలతో దానిని శవంగా మార్చుకోకూడదు.
దేహనికి సార్థకతను చేకూర్చే కర్మలనే చేయాలి. అపుడే భగవంతుని అనుగ్రహం పుస్కలంగా పొందవీలవుతుంది.
Subscribe to:
Posts (Atom)
శివోహం
శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...
-
శివా!మట్టితో అనుబంధ మెంత గొప్పదో పుట్టి గిట్టుటలోన నేను మట్టినే కూడి మట్టి బొమ్మను నిను తెలిసి మురిసినాను మహేశా . . ... . శరణు .
-
https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! సందేహాల పురమీ మానవ దేహం అహం, మోహం రెండూ గుణశ్రేణియై నీకు నాకు మధ్య దూరం పెంచుతున...
-
శివా! నీ నాట్యానికి నా అహము వేదిక కానీ నీ నామము నా పదమున దీపిక కానీ నా గమనం నిన్ను చేరీ ముగిసిపోనీ మహేశా.....శరణు.