Tuesday, June 24, 2025

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివా!
చావు పుటక నడుమ చైతన్యమే నీవు...
కర్మ ఫలము నిచ్చు కాల రూప...

కల్మషమనస్సుల కలిజగత్తులో అంతా పాపభీతే 

ప్రాయశ్చిత్తంకోసం మదిలో నీ నామ స్మరణ...

బ్రతుకు బాట లన్ని బాగుసేయుము తండ్రి.

శివ నీ దయ

Monday, June 23, 2025

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివా!
ఎప్పటి నుంచో తెలియదు కానీ ఈ హృదయంలో *ఆశ* అనే అజ్ఞానాంధకారం వ్యాపించింది... కామ, క్రోధ, లోభాది గుడ్లగూబలు ఆ చీకట్లో గూళ్ళు కట్టుకొని కాపురం చేస్తున్నాయి...
ఇంట్లోకి ఎలుక ప్రవేశించి నూతన వస్త్రాలను కొరికి పాడుచేసినట్లు నా మంచి ప్రయత్నాలను, సత్ర్పవర్తనలను పాడు చేస్తోంది.

శివ నీ దయ.

Sunday, June 22, 2025

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివా!
గుండె గూటిలో వెలుగుతున్న
జ్యోతినీ...
నీ పాద సన్నిధి కాడా దీపారాధనగా వెలిగించా.
నా ఆవేదనను నివేదనగా సమర్పించా...

శివ నీ దయ.

Saturday, June 21, 2025

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
శివ!
హలమును దాచి గళమును విప్పి  వచ్చావు రుద్రనాయకుడి వై భధ్రమూర్తిలా నడిపిస్తావు...
కాలహరుడివై సృష్టి చక్రమును శాసిస్తావు మోక్షనాధుడివై
ఆత్మఘోషలకు కరుణిస్తావు
భస్మరూపుడు వై విశ్వము నే పరిపాలిస్తావు...
నీకు సాటి ఎవరు లేరాయా నీకు నీవే సాటి.

శివ నీ దయ.

Friday, June 20, 2025

శివోహం

కాలం తో కలిసి...
నీవు ఆడిస్తుంటే...
బరువెక్కుతున్న కనురెప్పలు...
మనసు విశ్రాంతి కోరుతుంది శివయ్య.

శివ నీ దయ.

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
శివ!
అంధకారము లోని ఆనందం
అవని దాటి పుంతలు తొక్కుతొంది...

సంధికాలంలో  నవవసంతం
పుడమి దాటి పరవళ్లు  తొక్కుతోంది.

ఇచ్చేది నీవు మెచ్చేది నీవు...

ఐనా ఎందుకు మనసుకు ఈ బాధా ఎందుకు రోత
అసలెందుకు ఈ గందర గోళం లో చిందర వందర.

మహాదేవా శంభో శరణు.

Thursday, June 19, 2025

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
శివ!
అంధకారము లోని ఆనందం
అవని దాటి పుంతలు తొక్కుతొంది...

సంధికాలంలో  నవవసంతం
పుడమి దాటి పరవళ్లు  తొక్కుతోంది.

ఇచ్చేది నీవు మెచ్చేది నీవు...

ఐనా ఎందుకు మనసుకు ఈ బాధా ఎందుకు రోత
అసలెందుకు ఈ గందర గోళం లో చిందర వందర.

మహాదేవా శంభో శరణు.

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...