ఒకే ఒక కోరిక స్వామి...
నీ నందిని పంపుతావో...
నీ త్రిశూలాన్ని పంపుతావో...
లేక విబూదివై మమ్ము తరిస్తావో తెలియదు...
రా కదలిరా రా నువ్వు రా...
ఏకైక కోరిక నువ్వే లేచి రా...
శివానందాన్ని మాకు అందించగా రా
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...