Thursday, June 11, 2026

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

తెలిసి తెలియక నే చేసిన పాపమెంతో

తెలివి రాక నే చేసిన దోష మెంతో

మోయ లేనిక పాపాల భారమంతా నీ అడుగుల కడ పడి ఉందు నీలకంఠా...

స్వామి సుందర చైతన్యానంద

Wednesday, June 10, 2026

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివ
ఈ బతుకు నాటకము...
ఈ బంధములు, అనుబంధములు నాటకము...
జీవితము నాటకము...
జనన మరణాలు నాటకము...
సృష్టి నాటకము...
స్థితి లయలు నాటకము...
మనసు నాటకము...
మమతలు మనుషులు నాటకము...
జీవులు నాటకము...
జన్మ జన్మలు నాటకము..
నటనలు అన్ని నీవే...
నాటకములు నీవే...
ఉన్నది ఒక్కటే...
నీవే శాశ్వతం, నీవే నా సర్వము.
సర్వం శివ మయం జగత్.

ఓం శివోహం... సర్వం శివమయం.

Monday, June 8, 2026

శివోహం

శివ!
శ్వాస, శ్వాస మధ్య శూన్యంలో 
నీ నామం ప్రాణవాయువు అవుతుంది...
నీ నామమే ప్రాణాన్ని నిలుపుతుంది ఈశ్వరా.
నీన్ను చూస్తూ 
నీన్ను తెలుస్తూ 
నీన్ను స్మరిస్తూ 
మీ చేయి పట్టి నడిస్తే 
నా జీవన యానం 
అత్యంత సులభంగా 
ఉంటుంది తండ్రి.

శివ నీ దయ.

Friday, June 5, 2026

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివ!
స్త్రీలను పురుషులను ఆకర్షించట యందు అబద్దమాడినాను...
ఎన్నో ఆపద సమయంలో కాపాడమని ప్రాణభయం తో అబద్దమాడినాను...
పెండ్లి, కర్మలు, చేయుట   యందు అబద్దమాడినాను...
అదే నిత్యం అనుసరిస్తూనే ఉన్నాను క్షమించుము తండ్రి.

శివ నీ దయ.
ఓం శ్రీ క్రిష్ణపరమాత్మనే నమః 

అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్టే

అమ్మ అని పిలుస్తూ ఉంటే ఏదో ఒక రోజున తప్పక పలుకుతావు...
మమ్ము కూడా ఆడిస్తావు, అక్కున చేర్చుకుంటావు.

అమ్మ మీ దయ ఉంటే అన్ని ఉన్నట్టే.

ఓం శ్రీ మాత్రే నమః

Thursday, June 4, 2026

స్వామియే శరణం అయ్యప్ప

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

హరిహర పుత్ర అయ్యప్ప!

మదిలో మల్లెలు పూచెను...
ఆ వెన్నెల వెలుగులలో మీ బంగారు కోటను మరొక్క మారు రావాలని కాబోలు...
మిమ్ము చేరు దారి చూపించవా? తండ్రీ.

మణికంఠ శరణు 

Wednesday, June 3, 2026

శివోహం

శివ!
ఈ పాపపు కూపమున దొర్లు జీవితమునకు అనుదినమూ మీ నామ స్మరణ చేయనిదే తనివి తీరదు తండ్రి...
అదే ఆనందం మహధానందం నాకు...
మిమ్ము చేరు ఈ దాసుని బతుకు సదానందము చేసి మీ భక్తిలో తరింప బాధ్యత మీదే తండ్రీ.

శివ నీ దయ.