బంధాలు కొన్ని ఋణాలు తీరగానే బంధ విముక్తి అవుతాయి. వారి నుండి దూరం పెరుగుతుంది.కొన్ని రుణాలు జన్మ జన్మల నుండి వస్తూ ఉంటాయి. అవే తల్లిదండ్రుల ఋణం, ఋషుల రుణం,దేవతా ఋణం.. ఇవి ఎప్పుడూ వెంటే ఉంటాయి.
మంచితనం, మానవత్వం, దయ ,పాప భీతి, భక్తి,భయం తో జీవితాన్ని ఆ దేవదేవుని పాదాల శరణు వెడితే జీవితం లో శాంతి ఆనందం లభిస్తుంది.
శివా ! ఎవరికి ఎవరు ? నిశబ్ధ చైతన్యం నీవు , అనంత గుణ గానం
నాలో నీవు పాడుతూనే ఉంటావు అనేక మహా యుగాల పరిష్వంగన జన్మ బంధాలలో ఎత్తి లేస్తూ వస్తున్న ఎద్దును నేను కర్మలు , ఖర్మల కట్టెల అంటి కాలిపోతూ నన్ను చూసి ఒక నవ్వు నవ్వుతావు నీవు గుర్తు ఉంది మళ్ళీ మామూలే నీకు నీవే నాకు నేనే శివా ! నీ దయ