శివ
శివయ్యా
ఇంకనూ మిగిలిన
స్వాసల భస్మం
నీకోసమే
చూపుల చందనం
నీ కోసమే
ప్రాణ దీపం
నీ కోసమే
నాకంటూ ఏమీ
మిగల్చకు
నా అన్న భావనే
రానీయకు
ఇంకా ఎంత కాలం
నా అనుకుంటూ
నీకు దూరంగా ఉంటాను?
నా అంటూ ఏదన్న ఉంటే
అది నీవే అని
తెలిసే జ్ఞానాన్ని
ప్రసాదించు
శివయ్యా నీవే దిక్కయ్యా
No comments:
Post a Comment