ఏ కోరికా లేకుండా భగవంతుడిని ప్రేమించడం, ఆరాధించడం మనకు అన్ని విధాలా మంచిది. ఈ లోకంలో ఏదైనా విలువైన ఫలాన్ని పొందాలనే ఉద్దేశ్యంతో దేవుణ్ణి సేవించడం భక్తి అనిపించుకోదు!. భగవంతుని కంటే విలువైనది మరొకటి లేదు. వేదాలు కూడానూ మన మనస్సులో ఏ కోరికలు లేకుండా భగవంతుడిని ప్రేమించమని సూచిస్తున్నాయి. దేవుని ప్రేమను పొందడానికి దేవుణ్ణి ప్రేమించాలి తప్ప ఇతర అవసరాల కోసం కూడదు.
No comments:
Post a Comment