ప్రేమ కు నిలయమైన నీ హృదయ మందిరంలో
నాకు స్తానం వుందని తెలియ చెప్పిన ఆ తరుణం
జన్మజన్మలకు మరువలేని మదురమైన అమూల్యమైన వెలకట్టలేని గడియ
గోపికలేంతో మంది ని ప్రేమకు పాత్రులైన
సత్య రుక్మిణిలతో ఎంత శక్యతగా నీవున్న
ఈ రాధ ప్రేమను ప్రపంచానికి చాటి చెప్పి నా జన్మను సార్ధకం చేసిన ఓ నా ప్రాణనాధ
నీ పైనే ప్రాణాలు పెట్టుకొని నీ కోసం ఎదురు చేస్తున్న
నీ నిచ్చెలికి ఒక్క సారి దర్శనమిచ్చి నయనానందం కలిగించుమా
No comments:
Post a Comment