శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
▼
Monday, September 14, 2020
శివోహం
మానవుణ్ణి భగవంతునికి సన్నిహితునిగా చేయకుండా అజ్ఞామనెడి గోడ అడ్డుగా ఉంటుంటే, ఈ గోడను పడగొట్టి ముందుకు వెళ్ళినవారు సహితం అహంకారమనెడి మరొక గోడచే వెనుకకు నెట్టివేయబడుతున్నారు. 'భగవంతుడు నిజంగా ఉన్నాడు' అని గ్రహించడం ఎంత ముఖ్యమో ఆ భగవంతుడిని మనసులో నిలుపుకోవడం కూడా అంతే ముఖ్యం. కేవలము పుస్తకములను చదివినంత మాత్రమున భగవంతుని తత్వం అర్థమైపోదు! దానిని అనుభవించాలి! చదివిన దానిని, తెలుసుకున్న దానిని ఆచరిస్తేనే జ్ఞానం అనుభవంగా రూపాంతరం చెందుతుంది. ' నాకు అన్నీ తెలుసును, నేను అన్నీ చదివాను, నా కంటే గొప్పవారు లేరు..' ఇలా అనుకుంటే ఇంతకు మించి అజ్ఞానం మరొకటి ఉండదు. అజ్ఞానం ఉన్న చోట ఆధ్యాత్మికతకు చోటుండదనేది ఎంత సత్యమో ఆహం ఉన్న చోట ఆత్మారాముడు నిలువలేడనేది కూడా అంతే సత్యం. దీనిని మనం గుర్తుంచుకోవాలి.
No comments:
Post a Comment