మోహన్ వాంకుడోత్ - ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
(Move to ...)
Home
▼
Thursday, October 17, 2024
›
శివా!నీ స్మరణలో అనుక్షణం నీ స్పురణకై నిరీక్షణం కురియనిమ్ము నీ కటాక్ష వీక్షణం మహేశా ..... శరణు . శివా!గతమేమొ తెలియ గతి నెరుగలేను భవిష్యత్ ఏ...
›
శివా!నీ అడుగులకు మడుగులొత్తాలన్న నా సంబరం అంబరమైపోయే దిక్కులు మడుగులు చేయ నాతరమా మహేశా . . . . . శరణు.
›
శివా!విశ్వమే నీవు విశ్వంలో నేను నీలో నేను నాలో నువ్వు ఏకమై వున్నాము అనేకంగా మహేశా . . . . . శరణు .
›
శివా!భక్తికే గాని బహుమతులకు అందవు అనుభూతికే గాని అక్షులకు అందవు ఆద్యంతములయిన నీకు ఆద్యంతములు లేవు మహేశా . . . . . శరణు .
›
శివా!నేనును తీరుగా కప్పి వుంచేవు ఆ తీరును మేనుగ ఒప్పించేవు మేను కాని నేనును నేనెరుగనీ.. మహేశా . . . . . శరణు .
›
శివా!నమః శివాయ నమః శివాయ అంటున్నా నకార మకార మమకారం తొలగించమంటున్నా రాగ , వికారాలు వదిలించమంటున్నా మహేశా . . . శరణు .
›
శివా!అడ్డు కన్నుల చూడ అర్ధనారీశ్వరము నిలువు కంటికే తెలియు నీ నిజ తత్వము నిలువు కన్ను విరియనీ నిజ తత్వం తెలియనీ మహేశా . . . . . శరణు .
‹
›
Home
View web version