Friday, November 28, 2025

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివ!
నిత్యం ఏదో ఒక సమస్య తో సతమతం అవుతూనే ఉంది మనసు...
హృదయ ఆర్ద్రత మత్రమే ఉంది నా దగ్గర...
కన్నీరుతో అభిషేకించాలంటే ఉప్పగా
ఉంటాయి ఆ జలాలు...
తీపి ధారలు పోయాలంటే సంతోషాల గుర్తులు ఉండాలి...
ఏవి? అవి కనుచూపు మేరలో
కనిపించడం లేదు...
అందుకే మౌనంగా నిన్ను తలచుచూ నిలుచున్నా.

శివ నీ దయ.

అయ్యప్ప

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

హరిహర పుత్ర అయ్యప్ప!
సమస్త బంధాలు సముద్రములో సుడిగుండాలే...
కాల చక్రంలో తిరిగి కలిసే పేగుబంధాలు...
అర్ధంలో అర్ధము పరమాత్మ చూపే ఆత్మ బంధం  
దేవుడికి జీవుడికి మధ్య తలపుల బంధమే అసలైన బంధం...
నీ నా బంధం..

మణికంఠ శరణు.

Wednesday, November 26, 2025

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివ!
నా మనసు క్షణక్షణం ఎగిరెగిరి పడుతూ మారుతూ ఉంటుంది...
సకల మాయాలు మొసాలు చేసేది ఇదే...
దీని రాకడపోకడ ఎవ్వరూ ఎరుగరు నీవు తప్ప...
మాయదారి మనసు కల్లు తాగిన కోతి వలె మొహం అనే ఆ చెట్టు నుండి ఈ చెట్టుకు తిరుగుతుంది...
నువ్వు తప్ప నాకు ఎవ్వరున్నారు నీతో తప్ప నా మొరను ఎవ్వరితో చెప్పగలను...
నా గురించి నంది చెవిలో చెబుతున్న
నీ గురించి లోకం కి చాటి చెబుతున్న...
నా మాట నీకు చేరవేయగ నందిని నమ్ముతున్న.

శివ నీ దయ.

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివ!
నా నుదుటన ధరించిన ఈ మూడు గీతలే ఎప్పటికైనా ఆ మూడు కాలములను మార్చగలవు...
ఉన్న జన్మ తరించగలదు మరుజన్మ లేకుండా చేయగలదు...
పెనుభారములైన బంధాల కడలి నుండి జీవుని ధరికి చేర్చగలదు...
ఈ గీతలు పైకి నిరాడంబరమైనవి లోన మహా శక్తివంతమైనవి... 
అట్టి భస్మమును తన నుదుట ధరించిన వారి చరణములను నేను సదా ఆశ్రయించెదను.

శివ నీ దయ.

Monday, November 24, 2025

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివ!
నా బ్రతుకు
నా జీవితం
నాకు నచ్చని బాటలో సాగుతున్నా నీవిచ్చిన ఈ జననం నాకిష్టమే....
దినదినం సమీపిస్తున్నకొద్దీ
నీవియ్యబోయే మరణమూ నాకిష్టమే...
ఇన్ని జరుగుతున్న ఎలాంటి చలనం లేకుండా పైనుండి చోద్యం చూస్తున్న నువ్వూ నాకిష్టమే.
కానీ ఒకటే ఒక కోరిక తండ్రి
అందరికీ దూరంగా ,సుదూరంగా , స్వేచ్చా విహంగంలా ఆకాశమే హద్దుగా నాకు నేనుగా విహరించేలానైనా శక్తినివ్వు కాని పక్షంలో హాయిగా నీ ఒడినిచేరుకునేలానైనా నాకు వరమివ్వు.

శివ నీ దయ.

Sunday, November 23, 2025

హరిహర పుత్ర అయ్యప్ప

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

హరిహర పుత్ర అయ్యప్ప !
గుండె గూటిలో వెలుగుతున్న
జ్యోతి నీ పాద సన్నిధి కడ
దీపారాధనగా వెలిగించాలి...
నా ఆవేదన నీకు నివేదన గా అర్పించాలి...
అన్య కోరికలు కోరను 
నీ దర్శన భాగ్యం చాలు తండ్రి.

మణికంఠ శరణు.

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివ!
నా జీవితమే ఒక స్వప్నం
నిన్నటి రోజున ఉన్నది 
నేడు లేకపోయే..

ఈరోజు ఈ క్షణం
తర్వాత ఏమగునో
అందుకే శివా అంటూనే ఉంటాను
ఏదో సమయంలో వచ్చి
నన్ను చూసిపో.

శివ నీ దయ.

Thursday, November 20, 2025

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

ఏ దిక్కున చూసినా
నా దిక్కు నీవేనయా
ఓ ముక్కంటీశా...
ఒక్కసారి
నీ అక్కున చేర్చుకోరాదా
నే మక్కువగ నిను కోరుచుంటి
నీవొక్కడివే నాకు తోడునీడ

శివ నీ దయ.

Wednesday, November 19, 2025

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

ఏదో ఒక రోజున మిమ్ము చేరే వాటికై, ఉన్నంత కాలం అలుపులేక పరుగులు తీసేలా చేయిస్తావు...
ఏమి మీ మాయ? తండ్రీ శ్రీ మణికంఠ.

హరిహర పుత్ర అయ్యప్ప శరణు.

Monday, November 17, 2025

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

ఏదో ఒక రోజున మిమ్ము చేరే వాటికై, ఉన్నంత కాలం అలుపులేక పరుగులు తీసేలా చేయిస్తావు...
ఏమి మీ మాయ? తండ్రీ శ్రీ మణికంఠ.

హరిహర పుత్ర అయ్యప్ప శరణు.

Tuesday, November 11, 2025

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

సదాశివ!
తెలిసి కొన్ని, తెలియక కొన్ని తప్పించు కోలేని తరుణంలో చేసితిని తప్పులు...
ఎన్ని కన్నీటి వర్షాలు కురిసిన...
గుండె మంటలారాటం లేదు...
తప్పు చేసినట్లు విన్నవించు చున్న...
తప్పు క్షమించి నా మనసులో మాట చెవిని పెట్టు
నీ ఆట కాస్త విడిచి పెట్టు
నన్ను ఉద్ధరించగ దృష్టి పెట్టు.

శివ నీ దయ.

హరిహర పుత్ర అయ్యప్ప

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

ఎక్కడ ఉన్నా
ఎలా ఉన్నా
ఏ పని చేస్తున్నా,
భయంలో, బాధలో, సుఖంలో, సంతోషంలో
పాలలో కాస్త చక్కెరనో
తేనెనో కలుపుకొన్నట్లు
జీవితంలో మీ నామాన్ని కలుపుకోనీ మీ నామ ధ్యానంలో మునిగి నిరంతర మీ నామా స్మరణమే. 

హరిహర పుత్ర అయ్యప్ప శరణు.
శివ నీ దయ 

Saturday, November 8, 2025

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

నింగిలో సగం 
నెలలో సగం 
కష్టంలో భాగం సుఖంలో భాగస్వామ్యం...
ప్రకృతి లేని విశ్వమెక్కడ 
స్త్రీలేని బాంధవ్యమెక్కడ 
సంసారసాగరంలో తెరచాప నావ 
తెరచాపలేని నావ దిక్కులేనట్లే 
నావ లేని తెరచాపకు పరమార్థమేది
రెండు తోడయితేనే నావ తీరంచేరు
అదే ఆలుమొగల తత్వం 
అర్ధనారీశ్వరం.

ఓం అర్ధనారీశ్వరయా నమః.
సదాశివుడే సదా నాకు.

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

అత్యాశ అంటారేమో...
కానే కాదు...
ప్రయత్నం చేద్దాం.
ఈరోజు కాకపోతే రేపు...
రేపు కాకపోతే ఎల్లుండి లేదా ఆ మరుసటి రోజు...
ఈజన్మ కాకపోతే వచ్చేజన్మ... వచ్చేజన్మ కాకపోతే ఆ మరుజన్మ లేదా ఆ పైజన్మ...
ఏదో ఒకరోజునా...
ఏదో ఒక జన్మనా...
మన ప్రయత్నముకు ఫలితం రాక తప్పదు...
ఇదే కర్మ సిద్ధాంతం.
అందుకే దైవాన్ని భక్తిగా నిత్యం ప్రార్ధిద్దాం.

ఓం నమః శివాయ.

Friday, November 7, 2025

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

సదాశివ!
ఒకే ఒక కోరిక తండ్రి...
మరణం ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు కానీ...
మీరు ఇచ్చిన ఈ తనువు రోగగ్రస్తమై మంచాన పడి యాతనపడుతూ ఇతరులకు భారంగా మారేక వచ్చే మరణం మాత్రం వద్దు...
ఎవరి మీదా ఆధారపడకుండా, జీవితంలో ఎవరి ముందూ తలవంచకుండా, ఎవరినీ నొప్పించకుండా, ఎవరి వద్దా చులకన కాకుండా ఉండే జీవితాన్ని నాకు ప్రసాదించు...
మృత్యువు నా వద్దకు వచ్చినప్పుడు నేను నిన్ను దర్శించుకునే విధంగా దీవించు తండ్రి.

శివ నీ దయ.
సదాశివుడే సదా నాకు.

అమ్మ దుర్గమ్మ

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

బిడ్డ ఆకలి తల్లికి కనిపించదు...
మనసుకు తెలుస్తుంది...
అమ్మ ను తలుచుకుంటే చాలు భాదను తెలుసుకొని ఆదుకుంటుంది...
అమ్మ ను వేడుకుంటే మనసు  ప్రశాంత మవుతుంది.
అమ్మ దయ ఉంటే చాలు అన్ని ఉన్నట్టే కదా.

ఓం శ్రీమత్రే నమః
ఓం దుర్గాదేవినే నమః

Sunday, November 2, 2025

శివోహం

హరిహర పుత్ర అయ్యప్ప...

ఇతరులకు ఎంతో కష్టతరమైన విషయాలు...

నాకు మాత్రం తేలిక చేసేసి, ఒక్క పని మాత్రం గీత గీసి మిమ్ము చూడకుండా ఆపుట తగునా?.

మణికంఠ శరణు.