Tuesday, September 30, 2025

అమ్మ దయ

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

మోయలేని బాధకు
దారి తెలియని రేపటి కోసం ఎప్పుడు చింతించను తల్లి...
నను నడిపే నడిపే మీ మీదే భారం.
ఎందుకంటే అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్టే కదా 

ఓం శ్రీమాత్రే నమః.

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివా!
ఏదో లేదనే దిగులుకి,
అన్నీ ఉన్నాయనే అహంకారానికి..
అందని అతీతులకు ఆధీనం నేను.

శివ నీ దయ.

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివా!
ఏదో లేదనే దిగులుకి,
అన్నీ ఉన్నాయనే అహంకారానికి..
అందని అతీతులకు ఆధీనం నేను.

శివ నీ దయ.

Sunday, September 28, 2025

శివోహం

నమ్మకం బలంగా ఉన్నచోట దీవెనలు దండిగా ఉంటాయంట...
నమ్మి కొలిచి *శివ నీ దయ* అని తలిచినందుకేమో కోటికాంతులన్నీ నా కన్నుల్లోనే.

శివ నీ దయ.

Friday, September 26, 2025

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివా!
అద్దె ఇల్లు నాకే ఇరుకు గా ఉంది...
బాధలు బందలతో గుండె గదుల్లో చోటే లేదు...
ఇరుకు గుండెల కూడ ఇష్టపడతావు కదా అందులోనే నీవు నేను నీ నా కుటుంబం...
కాస్త ఇరుకుగా ఉంటుందేమో...
పెద్ద మనసుతో సర్దుకో తండ్రీ.

శివ నీ దయ.

Thursday, September 25, 2025

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

సర్వసృష్టి సమానత్వం శివతత్త్వం...
ఆస్తికుడు, నాస్తికుడు, జ్ఞాని, అజ్ఞాని, దేవతలు, రాక్షసులు, బలవంతుడు, బలహీనుడు, సర్వగ్రంధ పారాయణుడు, నిరక్షరాసుడు....
అందర్నీఆదరించి అనుగ్రహించే ప్రేమపరవశుడు నీవు...
రావణుడు రాక్షసుడని తెలిసినా అనుగ్రహించావు...
భస్మాసురుడు కృతఘ్నుడని తెలిసినా వరమిచ్చావు...
దోషభూయిష్టుల్ని సైతం నెత్తిన పెట్టుకొనే భక్తసులభడవు నీవు ఎంతటి పాపచరితులనైనా పునీతం చేసే దయాంతరంగడు....
నా మాట చెవిని పెట్టు నీ ఆట కాస్త విడిచి పెట్టు నన్ను ఉద్ధరించ దృష్టి పెట్టు.

శివ నీ దయ.

Wednesday, September 24, 2025

అమ్మ

This summary is not available. Please click here to view the post.

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివా!
పరిచయం అయ్యాక పలకరింపు లేకపోతే ఎలా తండ్రి...
నా గూడునొదిలి నీ గుడులు చుట్టూ నిను వెదుకుతూ తిరుగుతూనే ఉన్నాను
నోరారా శివ శివా అని ఆరాటంతో చూస్తున్నాను...
ఇక చాలు శివా నా గుండె గూటిలో
నుండే నాతో మాట్లాడు మౌనంగా.

శివ నీ దయ.

Tuesday, September 23, 2025

హరే కృష్ణా

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

కృష్ణా!
నీ దివ్వమంగళ చరణములను ఇంద్రీయ నిగ్రహం లేనివాడు ఇంద్రజాలం వేసి పట్టుకోగలడా...
అంతఃకరణ శుద్ధి లేనివాడు 
అంతర్జాలంలో వెదికి పట్టుకోగలడా...
 నేను ఆ కోవకే చెందినా వాడను తండ్రి.
నీదైన విశ్వంలో నీ పేరును పలికే 
నీ దయా భిక్ష ప్రసాదించు.

ఓం శ్రీ కృష్ణపరమాత్మనే నమః

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివా!
అన్నింటా నిన్నే చూస్తున్నా...
మరి నాలో నాకు ఎందుకు కనిపించవు...
నా చూపులో లోపమా లేక మనసులో నా...
జుట్టు నెరిసిపోయి,చర్మం ముడతలు పడితే తప్ప నాపై దయ చూపవా? తండ్రీ.

శివ నీ దయ.

Monday, September 22, 2025

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివా!
ఎప్పటి నుంచో తెలియదు కానీ...
ఈ హృదయంలో 'ఆశ' అనే అజ్ఞానాంధకారం వ్యాపించింది....
కామ, క్రోధ, లోభాది గుడ్లగూబలు ఆ చీకట్లో గూళ్ళు కట్టుకొని కాపురం చేస్తున్నాయి....
ఇంట్లోకి ఎలుక ప్రవేశించి నూతన వస్త్రాలను కొరికి పాడుచేసినట్లు, ఇది నా మంచి ప్రయత్నాలను, సత్ర్పవర్తనలను పాడు చేస్తోంది.
శివా!ఇద్దరం చెరొకటీ తీసుకుందాం
నిన్ను కొలిచే భాగ్యం నాకు
నన్ను కాచే భారం నీకు సరేనా.

శివ నీ దయ.

Friday, September 19, 2025

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివా!
తండ్రీ కొడుకుల (నీ,నా) అనుబంధం ఒక జన్మది కాదు...
ఒక జన్మతో తీరిపోదు....
అది జన్మజన్మల అనుబంధం....
జన్మజన్మలకూ సరిపోని బంధమే మనది...
అందమైన అబద్ధం లో జీవించే నాటకానికి తెరలేపి శాశ్వతమైన ఆనందం నీ పాదాల దగ్గర రప్పించు.

శివ నీ దయ.

Thursday, September 18, 2025

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివా !
తలచిన శివుడే
తలపున శివుడే
తలపులోన శివుడే
గడపన శివుడే
గడుపును శివుడే
కడుపున శివుడే
నడచిన శివుడే
నడుపును శివుడే
కుడిచిన శివుడే
తడబడు అడుగులు
నడుపును శివుడే
గనపడ గనపడి శివుడే
వగచిన శివుడే
పిలిచిన శివుడే
మలచిన శివుడే
సగమున శివుడే
నగవున శివుడే

శివా నీ దయ

Tuesday, September 16, 2025

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

ఇతరులు మనల్ని నిందించడం అంటే మన కష్టాన్ని, దుఃఖాన్ని వారు అనుభవించడం అని అర్థం..
మనల్ని దూషించేవారు నిద్రించేవారు మన పాపములను, కర్మలను వారు మోస్తున్నారు అని గుర్తుంచుకోండి మిత్రమా...
ఇది ప్రకృతి నియతి...
కనుక, వారికి మనం కృతజ్ఞతా భావంతో ఉండాలి...

ఓం నమః శివాయ

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

ఆ ఇల్లు ఈ ఇల్లు ఎంతకాలం తిరగగలను
ఏదో ఒక రోజు మూలన పడతాను కదా
అప్పటిదాకా ఎదురుచూపులు ఎందుకు
అలా కాకుండా అదును చూసి
నీ పంచను చేరే దారి చూపించు కదా.

శివ నీ దయ.

Monday, September 15, 2025

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివ నీ దయ తో ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం లో ఆ నలుగురిని సంపాదించేశా...
ఇక ముగింపు పలుకు నాకు లేకుండా ఇంక ఏ పలుకు...

శివ నీ దయ..

Friday, September 12, 2025

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివ నీ దయ తో ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం లో ఆ నలుగురిని సంపాదించేశా...
ఇక ముగింపు పలుకు నాకు లేకుండా ఇంక ఏ పలుకు...

శివ నీ దయ..

Thursday, September 11, 2025

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివా!

సందేహాల పురమీ మానవ దేహం
అహం, మోహం రెండూ గుణశ్రేణియై
నీకు నాకు మధ్య దూరం పెంచుతున్నాయి
నీ త్రినేత్రమున వాటిని
దగ్దము చేయరాదా సర్వేశ్వరా.

శివ నీ దయ.

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

వదిలానన్నా వదలదీ మాయ...
యోగికి యోగిణిగా వుండింది మాయ...
వదలకుండా వెంబడించింది మాయ...
శ్రవణకుడికి శ్రవణిగా నుండింది...
మాయ యతికి పరాకిగా నుండింది మాయ...
నీ మాయకు బెదిరేదాన్ని కాను నేను చెన్నమల్లికార్జున దేవా మీయాన.

అక్క మహదేవి వచనం నుండి🙏

Tuesday, September 9, 2025

Monday, September 8, 2025

అమ్మ

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

మస్తే అద్భుతసంధానే శ్రీ వాసవాంబ నమస్తే భద్రరూపిణి దుఃఖహరిణి శివ నమస్తే పద్మపత్రాక్షి మీనాక్షి విశాలాక్షి నమస్తే నమో సుందరాంగి నమో నమః

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివా!
నీవు దేవాది దేవుడవు,పరమాత్ముడవు...
నేను కర్మకు భద్దుడైన జీవుడను...
నేను చేసిన తప్పులను మన్నించ మనను, దానికి తగిన శిక్ష అనునుభావిస్తాను...
ఉన్నతోత్తముడవు నీవు...
పుట్టుక లేని వాడవు...
మేము ఉమ్మి తొట్టిలో పుట్టినవారము...
సర్వసాస్త్రములు తెలిసినవాడవు నీవు...
కాసులకోసం, విద్య కోసం,భాదలు పడేవారము...
ఆహారము వదలలేను, సంసార సుఖము వదల లేను, ఇంద్రియభోగములకు చిక్కితిని , పాపము పుణ్యము తెలియని వాడను, మంచి చెడు తెలిసుకోలేని వాడను శివా
కర్మకు భద్దుడనై, నా వారి కొరకు, దేశముకొరకు, భక్తితో, ప్రేమతో  సేవ  చేస్తున్నాను.

శివ నీ దయ.

Sunday, September 7, 2025

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివా!
నాతో ఏర్పాటు చేసుకున్న, మీరు ఇచ్చిన తాత్కాలిక బంధాలన్నీ తెంపేసుకోనీ రావాలని ఉంది...
పేగు బంధం తెంచుకునేది...
నీ వైపు తరలి పోవడానికే  .
సంకెళ్లేవీ లేకుండా నిన్నిక కొత్తగా ఏ చింత లేకుండా మీ సేవ చేయడానికే.

శివ నీ దయ.

Saturday, September 6, 2025

అయ్యప్ప

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

హరిహరపుత్ర అయ్యప్ప!

ఏదో కష్టం వచ్చిందని వెనకడుగు వేయను.. 
నా వెన్నుతట్టి నడిపేందుకు....
నా వెనుక నీవు ఉన్నవనే ధైర్యమే నను ముందుకు నడిపిస్తుంది నీ నామం.

ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప.

శివోహం

శివా...
మీరు రమ్మన్న చోటుకు వచ్చి 39 సంవత్సరాలు...
మరి నీవెప్పుడు వస్తావో...
శ్రీగిరి మల్లికార్జునా..
నాకు రాసిపెట్టినదేదో త్వరగా ఇచ్చేస్తే నాపని, ఓ భారం తగ్గిపోతుంది కదా.

శివ నీ దయ.

Tuesday, September 2, 2025

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

చకోరమునకు చంద్రుని వెన్నెల చింత...
కమలమునకు సూర్యోదయపు చింత...
తుమ్మెదకు సువాసన గ్రోలు చింత...
నాకు నాకూడల సంగమదేవుని తలచు చింత.

శివ నీ దయ.

Monday, September 1, 2025

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

వనములోని దేవతరువులన్నీ నీవే, తరువుల్లో కదిలే ఖగమృగాలన్నీ నీవే,
ఎప్పుడూ నీవే, అంధకారమున వెలుగువు నీవే, 
కష్టమున తోడువు నీవే, 
కనులు చెమ్మగిల్లిన వేళ ఓదార్పు నీవే, 
గురువులకు గురువైన ఆదిగురువువు నీవే, 
సకలం నీవే  నా సర్వము నీవే 
చెన్నమల్లికార్జునా సర్వభరితుడవై నాకెందుకు కనరాకున్నావు.

అక్క మహాదేవి వచనం నుండి